Sunday, January 19, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్: 500 కేంద్రాల్లో 50రోజులు

ఆర్ఆర్ఆర్: 500 కేంద్రాల్లో 50రోజులు

Half Century:  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించిన ఈ సినిమా ఓ సంచ‌ల‌నం. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. టాక్ డివైడ్ గా వ‌చ్చిన‌ప్ప‌టికీ.. రిలీజైన అన్ని ఏరియాల్లో స‌రికొత్త రికార్డులు సృష్టించింది.

ఈ చిత్రం విడుదలై స‌క్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే.. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా మూడు నుంచి ప‌ది రోజులు మాత్ర‌మే ఆడుతోంది. అలాంటిది ఆర్ఆర్ఆర్ మూవీ 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం.. అది కూడా 500 సెంటర్లలో ఆడ‌డం విశేషం. ఆర్ఆర్ఆర్ ఈ ర‌కంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఇప్ప‌టి వ‌ర‌కు 1150 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసింది. ఇంకా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది.

Also Read : 20న  ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్