Saturday, March 29, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా: ఏప్రిల్ 1 విడుదల

ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా: ఏప్రిల్ 1 విడుదల

RRR again postponed: ‘ఆర్ఆర్ఆర్’.. అభిమానులంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్న సినిమా….   జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విడుదల తేదీని మరోసారి మార్చారు. అయితే కరోనా కేసులు, ప్రభుత్వాల అంక్షల నేపథ్యంలో ఏప్రిల్ 1 న సినిమా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.

‘బాహుబ‌లి’ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఇటీవలే స్పీడు పెంచి దూసుకెళుతున్నారు.  అన్ని రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ పర్యటించి సినిమాపై ప్రమోషన్ చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల క్రితమే సినిమా విడుదలపై అనుమానాలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ విడుదల వాయిదా వేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్