Sunday, January 19, 2025
Homeసినిమాడిసెంబర్ 9న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్

డిసెంబర్ 9న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్

RRR Trailer this week:
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌థీరుడు రాజమౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ భారీ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుదల చేయాలనుకున్నారు. అయితే.. సుప్ర‌సిద్ధ‌ సినీ గీత‌ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో పాటు కొన్ని అనుకోని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా వేశారు. తాజాగా డిసెంబరు 9న విడుదల ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.

సోష‌ల్ మీడియాలోనే కాకుండా.. అదే రోజున ఉదయం 10 గంటలకు థియేటర్స్‌ లోనూ విడుదల చేయనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ట్రైల‌ర్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా న‌టిస్తే.. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ న‌టించ‌గా ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ న‌టించారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందించారు. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్