Tuesday, September 17, 2024
Homeసినిమావెంకీ సరసన సుశాంత్ హీరోయిన్

వెంకీ సరసన సుశాంత్ హీరోయిన్

విక్టరీ వెంకటేష్ ఆమధ్య నారప్ప, దృశ్యం 2 చిత్రాల్లో నటించారు. ఆడియన్స్ ని మెప్పించారు. అయితే.. ఈ సినిమాలు థియేటర్లో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇప్పుడు ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇందులో వెంకీ, రానా కలిసి నటించారు. ఈ నెల 10న రానా నాయుడు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే.. కెరీర్ లో 75వ చిత్రాన్ని వెంకీ, శైలేష్ కొలనుతో చేయనున్నారు. ఈ మూవీ టైటిల్ ‘సైంధవ్’. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తుండడం విశేషం.

ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇందులో వెంకీ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌థ ప్ర‌కారం ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ట‌. ఓ హీరోయిన్ ని బాలీవుడ్ నుంచి తీసుకుని మిగిలిన ఇద్దరినీ సౌత్ నుంచి తీసుకోవాలి అని మేకర్స్ అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు సుశాంత్ హీరోయిన్ ని ఫిక్స్ చేశారని తెలిసింది. సుశాంత్ హీరోయిన్ ఎవరంటారా..? చిలసౌ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. అంతే కాదు హిట్ 1 లో కూడా నటించింది.

ఆ సెంటిమెంట్ ని దృష్టిలో ఉంచుకొని శైలేష్‌.. ఈ క‌థానాయిక‌ని ఎంచుకొన్నారేమో.? ముగ్గురు హీరోయిన్లున్నార‌ని ఇదేదో రొమాంటిక్ మూవీ అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ముగ్గురు హీరోయిన్లూ క‌థ‌లో భాగంగానే వ‌స్తారు. అంతే త‌ప్పా.. వెంకీతో డాన్సులు, రొమాన్సులూ చేయ‌డానికి కాదట. ఇది చాలా సీరియ‌స్ ఫేజ్‌లో సాగే క‌థ అని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ న‌వాజుద్దీన్ సిద్దీకీ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్