Sunday, September 8, 2024
Homeసినిమాఅశోక వనంలో సుభద్ర ఈ బ్యూటీనే!

అశోక వనంలో సుభద్ర ఈ బ్యూటీనే!

టాలీవుడ్ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడానికి విష్వక్సేన్ రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఆయన నుంచి ‘పాగల్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ కాకపోతే తన పేరు మార్చుకుంటాననే శపథాలు గట్రా చేశాడు. కానీ ఆ కథ జనాలకు ఎక్కలేదు. కనిపించిన ప్రతి అమ్మాయికి పువ్వు ఇస్తూ వెళుతూ, అలా చేయడం వెనుక మదర్ సెంటిమెంట్ ను లింక్ చేశారు. ఈ లింక్ సహజత్వానికి దూరంగా ఉండటంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు.

ఈ నేపథ్యంలో విష్వక్సేన్ మరో సినిమాను పట్టాలెక్కించాడు. త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సినిమా పేరే ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. రామాయణానికి .. మహాభారతానికి ముడిపెడుతూ ఈ టైటిల్ ను సెట్ చేశారు. బహుశా కొత్తదనమనేది టైటిల్ నుంచే స్టార్ట్ చేశారేమో.బాపినీడు – సుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో వడ్డీ వ్యాపారం చేసే అల్లం అర్జున్ కుమార్ పాత్రలో విష్వక్సేన్ నటిస్తుండగా, పసుపులేటి మాధవ్ పాత్రలో రుక్సార్ థిల్లాన్ కనిపించనుంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరో కనోక్కోండి అనేసి చిన్నపాటి సస్పెన్స్ కి గురిచేసి ఆ తరువాత రివీల్ చేశారు. టైటిల్ ప్రకారం చూసుకుంటే సుభద్ర ఈ బ్యూటీనే అన్నమాట. ‘కృష్ణార్జున యుద్ధం’ .. ‘ఏబీసీడీ’ సినిమాల్లో మెరిసిన ఈ సుందరి ఒక మంచి ఛాన్స్ అయితే కొట్టేసింది. ఆల్రెడీ ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్