Sunday, January 19, 2025
Homeసినిమాసిస్టర్ పాత్రలో సాయిపల్లవినా? .. ఛాన్సేలేదే!

సిస్టర్ పాత్రలో సాయిపల్లవినా? .. ఛాన్సేలేదే!

టాలీవుడ్ లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గ్లామరస్ హీరోయిన్స్ కి మించి ఆమెకు ఫాలోయింగ్ ఉండటం విశేషం. జయసుధ .. సౌందర్య .. స్నేహ తరువాత, పద్ధతి గల పాత్రలతో మనసులను కొల్లగొట్టేసిన కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది. ఇక ఆమె డాన్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ. సాయిపల్లవి తెరపైకి రావడానికి ముందు హీరోల డాన్సుల గురించే మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ జాబితాలో సాయిపల్లవి పేరు కూడా కనిపిస్తుంది .. వినిపిస్తుంది.

ఇక సాయిపల్లవి ఒక సినిమా చేసిందంటే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ కి ఉంది. తాను ఎంచుకునే కథల వలన .. పాత్రల వలన ఆమె ఆడియన్స్ లో ఆ కాన్ఫిడెంట్ ను కలిగించింది. ఇక ఆమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం .. ఆ సినిమాలో తాను చేసిన డాన్స్ హైలైట్ కావడం సాయిపల్లవిలోని విశేషంగా చెప్పుకోవచ్చు. అలా ఆమె చేసిన ‘లవ్ స్టోరీ’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. సాయిపల్లవికి గల క్రేజ్ ను మరింతగా పెంచాయి.

అలాంటి సాయిపల్లవి మహేశ్ బాబుకి సిస్టర్ పాత్రలో కనిపించనుందనే ఒక టాక్ వినిపిస్తోంది. అదీ త్రివిక్రమ్ మూవీలో. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే నటించనుంది. మహేశ్ బాబుకి  చెల్లెలి పాత్రను మాత్రం సాయిపల్లవి చేయనుందని అంటున్నారు. కానీ ఇది కేవలం పుకారు మాత్రమే అనుకోవచ్చు. ఎందుకంటే అలా కనిపించడానికి సాయిపల్లవి ఒప్పుకునే అవకాశం లేదనే చెప్పాలి. కెరియర్ పరంగా ఆమె తీసుకునే నిర్ణయాలు .. ముందుకు వెళుతున్న తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక సాయిపల్లవిని సిస్టర్ రోల్ లో చూడాలని అభిమానులు కోరుకోవడం లేదు కూడా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్