ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై వారం రోజులు దాటుతున్నా కొలిక్కి రాకపోవటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. ఉక్రెయిన్ కు నాటో కూటమిలో సభ్యత్వం ఇస్తే దాడులు తప్పవని మొదటి నుంచి రష్యా హెచ్చరిస్తూనే ఉంది. ఈ దిశగా యూరోప్ దేశాలు, ఆమెరికాతో రష్యా పలుమార్లు చర్చలు జరిపినా పలవంతం కాలేదు. పైగా అమెరికా, నాటో దేశాలు మేము మీ వెనుక ఉన్నాం… మీకు అండగా ఉంటాం అని ఉక్రెయిన్ కు హామీలు ఇవ్వటం ద్వారా ఈ ఉత్పాతం సంభవించింది అనటంలో అతిశయోక్తి లేదు.
భారత దేశం సరిహద్దు దేశాలైన శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలొ చైనా సైనిక స్థావరాలు నిర్మించి, అణ్వాయుధాలు మొహరిస్తే మనకు ఎలా ఉంటుందో సరిగ్గా రష్యా విషయంలో అదే జరిగింది. రష్య చుట్టు పక్కల దేశాలైన లాత్వియా, లిధువేనియా, ఎస్థోనియా, జార్జియాలను అమెరికా నాటో కూటమిలోకి లాక్కుని — ఆయా దేశాలలొ కొన్ని సంవత్సరాలుగా అమెరికా స్థావరాలను ఏర్పాటు చేస్తూ, ఆయుధాలను మొహరిస్తోంది.
ఇప్పుడు అదే దారిలొ ఉక్రెయిన్ ను కూడా నాటోలోకి లాక్కుని, ఉక్రెయిన్ లో కూడా అమెరికా అదే విధంగా స్థావరాలను ఏర్పాటు చేద్దామని చూసింది. ఉక్రెయిన్ సరిహద్దుల నుండి అమెరికా 100 సెకన్లలొ మాస్కోను ద్వంసం చేయచ్చు. దీనితో అప్రమత్తమైన రష్యా అద్యక్షుడు పుతిన్ ముందు అమెరికా, ఉక్రెయిన్ దేశాలతో చర్చలు జరిపాడు, అనేక హెచ్చరికలు చేశాడు. అవి విఫలం కావటంతో తప్పని పరిస్థితులలొ దాడులు ప్రారంభించాడు. అయితే రష్యా దాడుల్లో సైనిక స్థావరాలు, రక్షణ సంస్థలు కాకుండా పౌర ప్రాంతాలపై దాడులు జరగటం విమర్శలకు దారితీస్తోంది.
ఇవి కూడా చదవండి: ఉక్రెయిన్ పిలుస్తోంది