Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ డైరెక్ట‌ర్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

Pawan-Sujith: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘వ‌కీల్ సాబ్’ తో రీఎంట్రీ ఇవ్వ‌డం, బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం తెలిసిందే. రీసెంట్ గా భీమ్లా నాయ‌క్ సినిమాతో మ‌రో హిట్ కొట్టారు. ఇలా వ‌రుస‌గా రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాతో మూడో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో తాజా షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. ద‌స‌రాకి ఈ మూవీ విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ తో మూవీ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రా ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ అంటే.. ప్ర‌భాస్ తో సాహో సినిమాని తెర‌కెక్కించిన సుజిత్ అని స‌మాచారం. పవర్ స్టార్ హీరోగా ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసే బాధ్య‌త‌ను సుజిత్ కి అప్ప‌గించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

సాహో త‌ర్వాత సుజిత్ చిరంజీవి లూసీఫ‌ర్ రీమేక్ ని డైరెక్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. అయితే.. అన్న‌య్య చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ను సుజిత్ సొంతం చేసుకున్నాడ‌ని టాలీవుడ్ లో గ‌ట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే.. సుజిత్ కి బంప‌ర్ ఆఫ‌రే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్