Solo Pallavi: సాయిపల్లవి తెలుగు తెరకి పరిచయమైనప్పుడు, పెద్దగా అందగత్తె కాదే అనుకుంటూనే చాలామంది థియేటర్లకు వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లంతా ఆమె అభిమానులుగా మారిపోయి థియేటర్లలో నుంచి బయటికి వచ్చారు. అప్పటి నుంచి  ఆమె నటన ప్రధానమైన .. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. సాయిపల్లవి సినిమా అంటే ఆ కథలో విషయం ఉంటుందనే సంగతి ఆడియన్స్ కి అర్థమైపోయింది. యూత్ లో కంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమె అభిమానులు ఉండటం విశేషం.

‘లవ్ స్టోరీ’ .. ‘శ్యామ్ సింగ రాయ్’  తరువాత సాయిపల్లవి చేసిన ‘విరాటపర్వం’ ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. అవినీతికి .. అన్యాయాలకు వ్యతిరేకంగా నక్సలైట్ రవన్న (రానా) దళం పోరాడుతూ ఉంటుంది. ఆయన విప్లవ సాహిత్యం చదివి ప్రభావితమైన వెన్నెల (సాయిపల్లవి) ఆయనను ఆరాధిస్తూ ఉంటుంది. ఆయనతో కలిసి ప్రేమను .. పోరాటాన్ని పంచుకోవాలనుకుంటుంది. అందుకోసం ఇల్లొదిలి వెళ్లిన వెన్నెలకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఏ ఉద్దేశంతో ఆమె గడప దాటిందో ఆ ఉద్దేశం నెరవేరిందా లేదా? అనేదే కథ.

1990లలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. కథాకథనాలను ఆసక్తికరంగా తయారు చేసుకోవడంలోను .. అందుకు తగిన లొకేషన్స్ ను ఎంచుకోవడం లోను .. తెరపై ఆవిష్కరించడంలోను దర్శకుడు వేణు  ఊడుగుల సక్సెస్ అయ్యాడు. సంగీతం .. సంభాషణలు  .. కెమెరా పనితనం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. సాయిపల్లవి పాత్రను తీర్చిదిద్దిన తీరు .. ఆమె అభినయం ఈ సినిమాకి హైలైట్. ఆమె హావభావాలకు అద్దం పట్టిన సినిమా ఇది. తప్పకుండా ఈ పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగినది అవుతుంది. రానా నటన కూడా ఆకట్టుకుంటుంది. నక్సలైట్ల పోరాటం వెనుక అంతర్లీనంగా దాగిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను నిరాశపరచదు.

Also Read : సాయిప‌ల్ల‌వి ఆకాశానికి ఎత్తేసిన వెంకీ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *