కొంత విరామం తర్వాత హీరో సాయి రామ్ శంకర్ ఒక పర్‌ఫెక్ట్ కమర్షియల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఎస్ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయి రామ్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా, సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి `రీసౌండ్` అని పవర్‌ఫుల్ మరియు మాస్-అప్పీలింగ్ టైటిల్ ఖరారు చేశారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని మరియు బాబీ `రీసౌండ్` ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే… సాయి రామ్ శంకర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేషన్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అంతకు ముందు పోలీసులతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ ఎలా ఉంబోతుందో ఈ పోస్టర్ సూచిస్తుంది. శ్రీ అమురత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ మరియు రియల్ రీల్ ఆర్ట్స్ పతాకాలపై జె. సురేష్ రెడ్డి, బి అయ్యప్ప రాజు మరియు ఎన్‌విఎన్ రాజా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో కొందరు ప్రముఖ నటీనటులు యాక్ట్ చేయనున్నారు.
స్వీకర్ అగస్తి సంగీత దర్శకత్వం వహిస్తుండగా సాయిప్రకాష్ ఉమ్మడి సింగ్ సినిమాటోగ్రఫీ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాగర్.యు ఎడిటర్. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.