Tuesday, February 25, 2025
HomeTrending Newsనెలాఖరులోపు గృహ సారథుల నియాకమం: సజ్జల

నెలాఖరులోపు గృహ సారథుల నియాకమం: సజ్జల

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. గృహసారధుల నియామకాలపై ప్రధానంగా చర్చించారు. వాస్తవానికి జనవరి 21తో గృహసారధుల నియామక సమయం ముగిసింది. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలో.. ఈనెలాఖరు వరకు ఆ సమయం పెంచుతున్నట్లు సజ్జల వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారధులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్