We are Open: ఉద్యోగ సంఘాల ఆందోళనలో రాజకీయపార్టీలు చేరితే సమస్య మరింత జటిలమవుతుందని, ఆ తర్వాత ఇక ఉద్యమాన్ని రాజకీయ పార్టీలే నడుపుతాయని, ఆందోళనను హైజాక్ చేసే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన అంశాలతో చర్చలకు ఇప్పటికీ తలుపులు తెరిచే ఉన్నాయని వెల్లడించారు. రెండ్రోజుల క్రితం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, మర్నాడు రావాలని చెప్పామని అయితే వారు రాలేదని, ప్రభుత్వం తరఫు నుంచి చర్చలకు ఆహ్వానం లేదని వారు చెప్పడం సరికాదన్నారు. వారు ఎప్పుడు ఫోన్ చేసి వస్తామన్నా వారితో చర్చించేందుకు తాము తయారుగా ఉన్నామన్నారు.
ప్రభుత్వం మీద ఒత్తిడి పెచాలన్నట్లుగా ఉద్యోగ సంఘాలు అనుకోవడం సరికాదని, వారుకూడా ప్రభుత్వంలో భాగమే అయినప్పుడు ఎవరు ఎవరి మీద ఒత్తిడి పెంచుతారని ప్రశ్నించారు. నిన్న విజయవాడలో ఆందోళనలో కూడా రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని సజ్జల అభిప్రాయపడ్డారు. లేకపోతే ఇంతమంది వచ్చి ఉండేవారు కాదన్నారు.ఒకవేళ ఉద్యోగులు సమ్మెకు వెళితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలపై విడుదల చేసిన జీవోలను వెంటనే నిలుపుదల చేయాలంటూ ఆ శాఖా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై మీడియా ప్రశ్నించాగా బదిలీలు కావాలని వారే కోరారని, ప్రభుత్వం పరంగా సాధారణంగా కార్యకలాపాలు ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Also Read : ఆవేశంతో నిర్ణయాలు వద్దు: మంత్రి నాని