Sunday, January 19, 2025
HomeTrending Newsగ్రహణం వీడింది: సజ్జల

గ్రహణం వీడింది: సజ్జల

నేటి హైకోర్టు తీర్పుతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సజ్జల స్పందించారు. ఎన్నికల నిర్వహణ మొదలుపెట్టిన నాటి నుంచి ప్రతి విషయంలో చంద్రబాబు అడ్డుపడుతూ వచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయి కేవలం కౌంటింగ్ కోసమే ఎదురు చూస్తున్న తరుణంలో  తెలుగుదేశం, జనసేన పార్టీలు కోర్టుకు వెళ్లాయని, చివరకు హైకోర్టు అన్నీ పరిశీలించి, కౌంటింగ్ కు అనుమతిస్తూ తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేవలం కొన్ని సాంకేతిక కారణాలను సాకుగా చూపించి అసలు ఎన్నికలు జరపకుండా చూడాలని బాబు ఎంతో శ్రమించారని, కానీ వారి ఆటలు సాగలేదని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, వారితో మమేకం కావడం, సేవ చేయడం, మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి అభిమానాన్ని సంపాదించాలని సజ్జల సూచించారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా, ఏడాదిపాటు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తూ ప్రజల తీర్పును కాలరాయడం కోసం వారు చేసిన ప్రయత్నాలను ఒక కే స్టడీగా తీసుకొవచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు.  ఎన్నికల ప్రక్రియ అప్పటికే మొదలైనా, జడ్పీ ఎన్నికలను మొదట నిర్వహించకుండా, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించి నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డరమేష్ బాబు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకున్నారని సజ్జల తీవ్రంగా మండిపడ్డారు.

ఇప్పటికే మొత్తం ప్రక్రియ పూర్తయి మండల పరిషత్, జిల్లా పరిషత్ లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాల్సిందని, కేవలం చంద్రబాబు కుటిల రాజకీయాల వల్లే ఆరునెలలపాటు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.

దిశా యాప్ పై లోకేష్ తీరు దారుణం
మహిళల రక్షణ, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టం తీసుకువచ్చిందని, ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉందని సజ్జల వివరించారూ. దిశా యాప్ పై వారం రోజులుగా నారా లోకేష్ ఆందోళన చేస్తున్నారని, దిశా చట్టం ప్రతులు లోకేష్ తగలబెట్టడం దారుణమని సజ్జల అన్నారు. ఆయనకు మతి ఉండే ఈ పని చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళలు వేధింపులపై కనీసం ఫిర్యాదు చేయడానికే అవకాశం లేకుండా చేశారని సజ్జల విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్