Sunday, January 19, 2025
Homeసినిమాస‌లార్ క్లైమాక్స్ అలా ప్లాన్ చేస్తున్నారా..?

స‌లార్ క్లైమాక్స్ అలా ప్లాన్ చేస్తున్నారా..?

Salar: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం స‌లార్. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా చ‌రిత్ర సృష్టించ‌డంతో స‌లార్ పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే.. స‌లార్ అప్ డేట్స్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్న అభిమానులు కోసం అన్న‌ట్టుగా ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే… కేజీఎఫ్ 2 సినిమాలో క్లైమాక్స్ కి కథ సముద్రం పైకి చేరుకుంటుంది. అలాగే సలార్ సినిమా క్లైమాక్స్ కూడా సముద్రం పైకి చేరుకుంటుందని అంటున్నారు. సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర పై చూడ‌ని విధంగా ఉంటుంద‌ని.. ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.

జగపతిబాబు ఇందులో ఓ డిఫ‌రెంట్ పాత్ర‌ను పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా షూటింగ్ కి బ్రేక్ ప‌డ‌డంతో ఆల‌స్యం అయ్యింది. త్వ‌ర‌లో స‌లార్ టీజ‌ర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read : స‌లార్ టీజ‌ర్ వాయిదా ప‌డిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్