Sunday, January 19, 2025
HomeసినిమాSalaar Trailer: 'సలార్' ట్రైలర్ కు ముహూర్తం కుదిరిందా..?

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ కు ముహూర్తం కుదిరిందా..?

ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న మూవీ ‘సలార్’. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సలార్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అయితే.. అంచనాలు రెట్టింపు అయ్యాయి. గ్లింప్స్ లో ప్రభాస్ నుంచి డైలాగ్ లేకపోయినా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఆగష్టు నెలాఖరున విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడు సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తారా అని ప్రభాస్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 7న సలార్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారని తెలిసింది. ఈ ట్రైలర్ ను డైరెక్ట్ గా రిలీజ్ చేయకుండా భారీగా ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేయాలి అనుకుంటున్నారట. ఈ ఈవెంట్ ను హైదరబాద్ లో ఏర్పాటు చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీని సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్