హీరోయిన్ సమంత అరుదైన మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవలే ఆమె తాజా చిత్రం యశోద టీజర్ విడుదలైంది. తన సినిమా టీజర్ ను ఆదరిస్తున్న సినిమా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాను ఈ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని కూడా ఆ ప్రకటనలో తెలియజేశారు. చికిత్స తీసుకుంటున్న ఫోటోను కూడా ఆమె ఈ ప్రకటనతో షేర్ చేశారు.
అయితే ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా రోగ నిరోధక శక్తిని హరించి వేసే గుణం ఉందని తెలుస్తోంది. కూర్చొని ఒక్కసారిగా పైకి లేచినప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు భుజాలు పైకెత్తేటప్పుడు ఇబ్బంది ఎదురవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిల్చుని ఉన్నప్పుడు, లేదా నడిచినప్పుడు, శ్వాస తీసుకునే సమయంలోనూ సమస్యలు ఉంటాయని తెలుస్తోంది.
రెండు నెలల క్రితం తనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ వ్యాధి విషయం వెల్లడైందని, ప్రేక్షకుల ఆశీర్వాదంతో కోలుకున్తానని సామంత ధీమా వ్యక్తం చేసింది. తన జీవితంలో.. శారీరకంగా, మానసికంగా ఎన్నో మంచి, చెడు రోజులు ఉన్నాయని, ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగామించానని, ఈ వ్యాధినుంచి కోలుకునేందుకు కొంత సమయం పట్టినా ఈ విషయంలోనూ తాను విజయం సాధిస్తానని విశ్వాసం వెలిబుచ్చింది.