Saturday, January 18, 2025
Homeసినిమాటీజర్ 'సమ్మతమే' అంటున్న హీరో కిరణ్ అబ్బవరం

టీజర్ ‘సమ్మతమే’ అంటున్న హీరో కిరణ్ అబ్బవరం

Teaser: కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌ గా న‌టించిన‌ చిత్రం `సమ్మతమే. ఈ సినిమా ద్వారా గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. యూజీ ప్రొడక్షన్స్ బేన‌ర్‌ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్ విడుద‌లైంది. రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్‌ లో ఎం.ఎల్‌.ఎ. ర‌వీంద‌ర్ కుమార్ రావ‌త్ ఆవిష్క‌రించారు.

ద‌ర్శ‌కుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని కృష్ణ స‌త్య‌భామ‌, బుల్లెట్ లా సాంగ్ ఆద‌ర‌ణ పొందాయి. మా టీమ్ మంచి సినిమా తీయాల‌నే త‌ప‌న‌తో ప‌ని చేశాం. జూన్ 24 న థియేట‌ర్ల‌లో చూసి ఆనందించండి అన్నారు.

హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ.. నేను ఏ పాత్రైతే అనుకున్నానో  దైవ‌నిర్ణ‌యంగా ఆ పాత్ర నాకు వ‌చ్చింది. చ‌క్క‌టి ల‌వ్‌స్టోరీ గా రూపొందింది. కిర‌ణ్‌, గోపీనాథ్‌, నేను ముగ్గురం షార్ట్ ఫిలింస్ నుంచే వ‌చ్చాం. శేఖ‌ర్ చంద్ర చ‌క్క‌టి బాణీలు ఇచ్చారు. త‌ర్వాత విడుద‌ల కాబోయే ట్రైల‌ర్ మ‌రింత బాగుంటుంద‌ని అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…  మా సినిమా నుంచి గ్లింప్స్‌, రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. మంచి ఆద‌ర‌ణ పొందాయి. సినిమా రంగంలోకి రావాల‌నే 2017లో హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ప‌రిచయమైన‌ వ్య‌క్తి గోపీనాథ్‌. ఇద్ద‌రం షార్ట్ ఫిలింస్ చేశాం. సినిమా తీయాల‌నే ప్ర‌య‌త్నాలు చేశాం. ఆ త‌ర్వాత నేను న‌టించిన `రాజావారు రాణివారు, `ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ మండ‌పం` విడుద‌ల‌యి స‌క్సెస్ కావ‌డంతో ఈ సినిమా పై మ‌రింత బాధ్య‌త పెరిగింది. దానితో పాటు బడ్జెట్ కూడా పెరిగింది. అయినా క్వాలిటీ విష‌యంలో రాజీప‌డ‌కుండా ద‌ర్శ‌కుడు కేర్ తీసుకున్నాడు. శేఖ‌ర్ చంద్ర సంగీతం చాలా బాగుంది. సతీష్ విజువ‌ల్స్ హైలైట్ అయ్యాయి. చాందినీ కూడా షార్ట్ ఫిలింస్ నుంచి వ‌చ్చింది. మా జంట అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు.

Also Read : సమ్మతమే నుండి `బుల్లెట్ లా` సాంగ్ విడుద‌ల‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్