ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో రూపొందిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలై విజయవంతమైంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
“యునానిమస్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. చెన్నై, నార్త్ ఇండియాలోనూ షోలు పడ్డాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లోని సినిమాలతో కలిపి పోల్చి చూసి ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అవి నిర్మాతలు తెలియజేస్తారు. ముందు నుంచి మాస్ సినిమాలు చేస్తూ వస్తున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ అనుకున్న తర్వాత దాన్ని కమర్షియల్ యాంగిల్లో చేద్దామని అనుకున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్ సినిమా చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ చెప్పాను. యాక్షన్ మూవీ చేయడానికనే ఆ బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నాను.”
“దానికి ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్లు ఓ ఉద్దేశం కోసం పోరాడటం.. వంటి ఎమోషన్స్ కు అందరూ కనెక్ట్ అయ్యారు. ప్రీతి అస్రాని చేసిన విన్నింగ్ షాట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ గురించి, అందులోని యాక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ నంద తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనో, రివేంజ్ ఫార్మేట్‌లోనో సినిమా చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. కబడ్డీ ఇండియాలో పెద్ద మాస్ గేమ్. అలాంటి మాస్ గేమ్‌కు మాస్ ఎలిమెంట్స్ జోడిస్తే బావుంటుందనిపించింది. అందుకే ఈ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుకున్నాను.”
“నేను డైలాగ్స్ రాసుకునే సమయంలోనే ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకుపోవాలనేదే నా ఉద్దేశం. అందుకే ముందు ఒకలా చూపించినా, క్లైమాక్స్ లో అందరూ కలుసుకుని కప్ కొట్టుకొచ్చేలా చూపించాను. ఈ సినిమా క్లైమాక్స్ ఎడిట్ చేయడానికి ఇరవై రోజులు తీసుకున్నాను. క్లైమాక్స్ ను రెండు భాగాలుగా తీశాను. దాన్ని మిక్స్ చేసి ప్రేక్షకులు మెప్పించేలా ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పుడొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు, చివరి వరకు మనం గెలుస్తామా లేదా? అనిపించినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్‌కు మూడు రోజులు ఉన్నప్పుడు అరగంట కంటే ఎక్కువసేపు నిద్రపోలేదు” అంటూ ఈ సినిమా కోసం తాను పడిన శ్రమను వివరించారు.