Sunday, January 19, 2025
Homeసినిమా'సార్' పైనే ఆశలు పెట్టుకున్న సంయుక్త మీనన్!

‘సార్’ పైనే ఆశలు పెట్టుకున్న సంయుక్త మీనన్!

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన నాజూకు భామలలో సంయుక్త మీనన్ ఒకరు. తెలుగు తెరపై రాజ్యమేలుతూ వస్తున్న చాలామంది అందగత్తెల మాదిరిగానే ఆమె కూడా కేరళ నుంచే ఇక్కడికి దిగిపోయింది. తెలుగులో ఆమె సైన్ చేసిన ఫస్టు మూవీ ‘బింబిసార’ అయినప్పటికీ, ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మాత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాలో ఆమె రానా జోడీగా అలరించింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ, ఇండస్ట్రీ దృష్టిని ఆమె తనవైపుకు తిప్పుకోలేకపోయింది.

ఇక ఆ తరువాత ‘బింబిసార’ థియేటర్లకు వచ్చింది. కల్యాణ్ రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ స్థానంలో కనిపించపోవడం వలన, ఆ సినిమా కూడా ఆమె కెరియర్ కి హెల్ప్ కాలేకపోయింది. చెప్పుకోవడానికి రెండు భారీ హిట్స్ ఉన్నప్పటికీ, అందులో ఆమె పాత్ర ప్రమేయం తక్కువగా ఉండటమే అందుకు కారణమైంది. అప్పటి నుంచి ఆమె సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె నుంచి రావడానికి ‘సార్’ సినిమా రెడీ అవుతోంది. వెంకీ అట్లూరి .. సూర్యదేవర నాగవంశీ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందింది. ధనుశ్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదలవుతోంది. ఇదే రోజున తమిళంలో ‘వాతి’ టైటిల్ తో అక్కడ రిలీజ్ అవుతోంది. అక్కడ .. ఇక్కడా కూడా పాటల పరంగా మంచి మార్కులు పడిపోయాయి. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందనే ఆశతో సంయుక్త ఉంది. ఆమె ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.

Also Read :‘సార్’ పరిస్థితి ఎలా ఉండనుంది?

RELATED ARTICLES

Most Popular

న్యూస్