Saturday, January 18, 2025
HomeసినిమాSamyuktha Menon: సంయుక్త మీనన్ నిజంగానే గోల్డన్ లెగ్

Samyuktha Menon: సంయుక్త మీనన్ నిజంగానే గోల్డన్ లెగ్

సంయుక్త మీనన్ పాత్రలకు తగ్గట్టుగా బాగానే నటిస్తుంది. ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో పాత్ర చిన్నదా..? పెద్దదా..? అనేది పక్కనపెడితే.. సినిమాలు విజయం సాధించాయి. అందుకనే ఆమెను గోల్డన్ లెగ్ అంటున్నారు. నిజంగానే ఆమె సూపర్.. లక్కీ హ్యాండ్. ఆ అదృష్టం తనకు కూడా కలిసొస్తుందని నమ్మాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు ‘విరూపాక్ష’ విజయంతో అదే నిజం అయ్యింది. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ కేరళ కుట్టి సంయుక్త మీనన్ చూడడానికి కాస్త సమంతలా కనిపిస్తుంది. ఈ అందాల బొమ్మ తెలుగులో ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత ‘బింబిసార’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ రెండు విజయాల తర్వాత ధనుష్ ‘సార్’ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో కూడా పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది. కమర్షియల్ సక్సెస్ సాధించింది. దీంతో ఈ అమ్మడును గోల్డన్ లెగ్ అని పిలవడం స్టార్ట్ చేసారు సినీ జనాలు.

తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. దీంతో నిజంగానే సంయుక్త గోల్డన్ లెగ్ అంటున్నారు.  తమిళ్, మలయాళ చిత్రాలు చాలానే చేసింది. 2018 నుంచి హీరోయిన్ గా నటిస్తోంది కానీ.. ఆమెకి క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు చిత్రాలతో. త్వరలో డెవిల్ అనే చిత్రంలో కూడా కనిపించనుంది. ఇందులో మరోసారి కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. మరి.. ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్