అక్కినేని నాగచైతన్య, ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలోని సారంగదరియా పాట… జానపదగేయంగా పాపులర్ అయినటువంటి పాట. ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ముగ్ధ మనోహరంగా ఆలపించింది. తెలంగాణ జానపదానికి తోడు పవన్ అద్భుతమైన సంగీతం తోడవ్వడంతో ఈ పాట విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృష్టిస్తుంది.
ఫిబ్రవరి 28న రిలీజ్ చేసిన ఈ పాట కేవలం నెల రోజుల్లోనే 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి స్టార్ హీరోలు దళపతి విజయ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్స్ రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే 1మిలియన్ పైగా లైక్స్ సొంతం చేసుకుని ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఏకంగా 200 మిలియన్స్ వ్యూస్ మైలురాయిని అందుకుంది. ఈ పాట ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇదంతా కేవలం హీరోయిన్ సాయిపల్లవి వల్లనే సాధ్యమైందని చెప్పవచ్చు. ఈ విభిన్న ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీని ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా వేశారు.