Monday, January 20, 2025
Homeసినిమాస‌ర్కారు వారి రికార్డ్

స‌ర్కారు వారి రికార్డ్

Records goes on: సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టించింది. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్కారు వారి పాట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్టాఫ్ సూప‌ర్.. సెకండాఫ్ యావ‌రేజ్.. టోట‌ల్ గా సినిమా హిట్టు అనే టాక్ తెచ్చుకుంది.

ఇక రికార్డ్ విష‌యానికి వ‌స్తే.. ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్స్ లో మ‌హేష్ బాబు చిత్రాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా స‌ర్కారు వారి పాట‌ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఆర్ఆర్ఆర్ కాకుండా.. ఈ సంవ‌త్స‌రంలో వ‌చ్చిన చిత్రాల ప్రీమియ‌ర్స్ లో టాప్ గ్రాస‌ర్ గా నిలిచింది. రాధేశ్యామ్ – $900కె, భీమ్లానాయక్ – $870కె, ఆచార్య – $650కె సాధించ‌గా సర్కారువారి పాట – $925కె సాధించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టింది.

Also Read : ఫ్యాన్స్ మెచ్చే ‘సర్కారివారి పాట’

RELATED ARTICLES

Most Popular

న్యూస్