Sunday, February 23, 2025
Homeసినిమా'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తి

‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి

Shooting wrapped: సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూకుడు మీదున్న మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న ఈ చిత్రానికి సంబధించిన ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న స్పందన సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు కొనసాగిస్తుంది. తాజాగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మొత్తం పూర్తయింది.

హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, కీర్తి సురేష్, డ్యాన్సర్లపై మాస్ సాంగ్ ని చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు, కళావతి, పెన్నీ.. ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. రేపు ఉదయం11:07 గంటలకు విడుదల కానున్న టైటిల్ సాంగ్ మూడవ సింగిల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read : ‘ఆచార్య’ కు మ‌హేష్ ‘మాట’ సాయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్