May 10th Polling: దేశవ్యాప్తంగా మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటిలో ఏపీ నుంచి నాలుగు… తెలంగాణాలో రెండు స్థానాలు కూడా ఉన్నాయి. ఏపీలో వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వి. విజయ సాయి రెడ్డి, బిజెపి నుంచి వైఎస్ చౌదరి, టిజి వెంకటేష్, సురేష్ ప్రభు…..తెలంగాణలో టి ఆర్ ఎస్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, డి. శ్రీనివాస్ లు జూన్ 21న రిటైర్ కానున్నారు. వీరి స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇదే రోజున రిటైర్ అవుతున్న ప్రముఖుల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నేతలు చిదంబరం కపిల్ సిబ్బల్, , జైరాం రమేష్, అంబికా సోనీ; శివసేన నేత సంజయ్ రౌత్ లు కూడా ఉన్నారు.
షెడ్యూల్ ఈ విధంగా ఉంది…..
- మే 24 న నోటిఫికేషన్ విడుదల
- మే 31 వరకూ నామినేషన్ల స్వీకరణ
- జూన్ 1న నామినేషన్ల పరిశీలన
- జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ
- జూన్ 10 ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ , అదే రోజు కౌంటింగ్ జరగనుంది.
తెలంగాణ నుంచి టిఆర్ఎస్ నేత బండ ప్రకాష్ గౌడ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి గత వారం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఉన్నిక పోలింగ్ మే 30న జరగనుంది.