Sunday, May 19, 2024
HomeTrending Newsమాకూ బూతులు వచ్చు - బాబుపై సీదిరి ఆగ్రహం

మాకూ బూతులు వచ్చు – బాబుపై సీదిరి ఆగ్రహం

ఉత్తరాంధ్ర సృజల స్రవంతి… దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక అని, పోలవరం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తీసుకురావాలని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. పోలవరం లెఫ్ట్‌కెనాల్‌ను విశాఖపట్టణం వరకు ఆయనే తవ్వించారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర సృజలస్రవంతి ప్రాజెక్టు కోసం ఒక్క ఎకరా భూమినైనా సేకరించారా? భూసేకరణ అథారిటీ ఏర్పాటు చేశారా?  మీరు ఏమీ చేయకపోతే జగన్‌ అధికారంలోకి రాగానే భూమిని సేకరించామని త్వరలో పనులు మొదలుపెట్టబోతున్నామని వెల్లడించారు.  పలాసలో తన క్యాంపు కార్యాలయంలో సీదిరి మీడియాతో మాట్లాడుతూ నిన్న  చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.

చంద్రబాబు 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదని,  ఆయనతో పాటు ముఠా సభ్యులు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో.. రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారని, బాబు పెత్తందార్ల ముఠాకు నాయకుడనేది స్పష్టమయ్యిందని విమర్శించారు.

రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని ఊదరగొట్టుకునే బాబుకు ఎదుటి మనిషిని గౌరవించడం తెలియదా… “నువ్వు మా నోట్లో సీసం పోస్తానంటావా..? దొబ్బేస్తారంటావా? బొక్కేశారంటావా? బూతులు నీకేనా.. మాకు రావా?” అంటూ బాబుపై తీవ్ర స్థాయిలో సీదిరి నిప్పులు చెరిగారు. నువ్వు మా నోట్లో సీసం పోస్తే.. మేం నీ నవరంధ్రాల్లోనూ అదే సీసం పోయగలం. ఇందులో మాకేం మొహమాటం లేదు అంటూ హెచ్చరించారు.

ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఆస్పత్రి తానే శ్రీకారం చుట్టానంటూ  బాబు చేసిన వ్యాఖ్యలపై కూడా సీదిరి ఘాటుగా స్పందించారు. ప్రైవేట్‌ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కళాశాలల సంఘం ఆధ్వర్యంలో వాళ్లు ఒక ఆస్పత్రి పెట్టుకుంటానంటే  భూమి  ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు కానీ.. కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌ కోసం కాదని, 200 పడకల ఆస్పత్రి ఇచ్చానని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి హయాంలో పరిపాలన ఎంత సంతోషంగా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు గనుక రేపటి ఎన్నికల్లోనూ ఎగిరేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనేనని విశ్వాసం వెలిబుచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్