Saturday, February 22, 2025
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ ఓపెన్: సెమీస్ కు సేన్, గాయత్రీ- జాలీ జోడీ

ఇంగ్లాండ్ ఓపెన్: సెమీస్ కు సేన్, గాయత్రీ- జాలీ జోడీ

All England Open 2022: అల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2022 టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ సెమీస్ లోకి ప్రవేశించాడు. చైనా ఆటగాడు లు గాంగ్ జు గాయం కారణంగా వైదొలగడంతో నేడు జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ రద్దయింది.  జు వాకోవర్ కావడంతో సేన్ తర్వాతి రౌండ్లోకి ప్రవేశించాడు.

మహిళల డబుల్స్ విభాగంలో త్రీసా జాలీ- పుల్లెల గాయత్రి గోపీచంద్ జోడీ సేమీ ఫైనల్లో 14-21; 22-20; 21-15 తేడాతో సౌత్ కొరియా జోడీ లీ సోహీ- శిన్ స్యుంగ్ చాన్ పై విజయం సాధించారు, మొదటి సెట్ కోల్పోయిన ఆ తర్వాత కుదురుకొని రెండు వరుస సెట్లలో  పైచేయి సంపాదించారు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ ఓటమి పాలైంది. 24-22; 21-17 తేడాతో ఇండోనేషియా ద్వయం మార్కస్ ఫెర్నాల్ది- కెవిన్ సంజయ గెలుపొందారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్