తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సభ్యుల పేర్లను రాజభవన్ కు అందజేశారు. అయితే గతానికి భిన్నంగా కొత్తవారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. మొత్తం జాబితాలో గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఎనిమిది మందికే ఉంది. ఎక్కువగా యువతరానికి, సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్లను పక్కన పెట్టారు. కళా వెంకట్రావు, గంట శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కన్నా లక్ష్మీనారాయణ, బోండా ఉమా, ధూళిపాల నరేంద్ర, గద్దె రామ్మోహన్, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత లాంటి వారికి అవకాశం కల్పించలేదు.
ఇక సామాజిక వర్గం వారిగా వస్తే కమ్మ సామాజిక వర్గం నలుగురు (చంద్రబాబు మినహా), కాపు నుంచి నలుగురికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ కోటాలో వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, మైనార్టీల నుంచి ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి టీజీ భరత్ కు చోటు దక్కింది. 8 మంది బీసీలకు అవకాశం కల్పించారు
జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు నిడదవోలు నుంచి ఎన్నికైన కందుల దుర్గేష్ కు చోటు దక్కింది. బీజేపీ తరఫున ఒకరిని తీసుకోగా ధర్మవరం నుంచి గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ కు ఆ ఛాన్స్ దక్కింది.
విజయవాడ పశ్చిమ నుంచి ఎన్నికైన సుజనా చోవదరి మంత్రి పదవి ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆయనకు మొండి చేయి దక్కింది. మంత్రివర్గ కూర్పుపై లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించింది గొట్టిపాటి రవికుమార్, కేశవ్, టిజి భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సవితతోపాటు పలువురికి ఛాన్స్ దక్కడంలో లోకేష్ దే కీలక పాత్ర అని సమాచారం.
ఏపీ కేబినెట్
నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి
మంత్రివర్గ సభ్యులు
- కొణిదెల పవన్ కళ్యాణ్
- నారా లోకేష్
- కింజరాపు అచ్చెన్నాయుడు
- కొల్లు రవీంద్ర
- నాదెండ్ల మనోహర్
- పొంగూరు నారాయణ
- వంగలపూడి అనిత
- సత్యకుమార్ యాదవ్
- నిమ్మల రామానాయుడు
- ఎన్.ఎమ్.డి.ఫరూక్
- ఆనం రామనారాయణరెడ్డి
- పయ్యావుల కేశవ్
- అనగాని సత్యప్రసాద్
- కొలుసు పార్థసారధి
- డోలా బాలవీరాంజనేయస్వామి
- గొట్టిపాటి రవికుమార్
- కందుల దుర్గేష్
- గుమ్మడి సంధ్యారాణి
- బీసీ జనార్థన్ రెడ్డి
- టీజీ భరత్
- ఎస్.సవిత
- వాసంశెట్టి సుభాష్
- కొండపల్లి శ్రీనివాస్
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి