Wednesday, March 26, 2025
HomeTrending Newsసెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే

సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే

టీ.ఆర్.ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో హైదరాబాద్ సంస్థాన విలీన  దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ ఆర్ ఎస్ పి పి నేత డాక్టర్ కె .కేశవ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎటువంటి వివాదాలు అవసరం లేదు…సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే అని కేకే స్పష్టం చేశారు. ఇవాళ సంతోషకరమైన రోజని, ఆగస్టు 15 న నాడు తెలంగాణకు స్వాతంత్ర్యము రాలేదని, మనకు స్వాతంత్ర్యము కోసం ఏడాది ఆగామని వెల్లడించారు.

ఇవాళ మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిన రోజు అన్న కేకే సెప్టెంబర్ 17 పై వివాదాలు అనవసరం లేదన్నారు. ఆ సమయంలో భారత్ లో మనము కూడా విలీనం కావాలని కోరుకున్నామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్