Monday, February 24, 2025
HomeTrending Newsఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

Sevalaal Jayanti : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్  మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, లంబాడ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలు తెలంగాణ భవన్ లో మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. బంజారా మహిళలు సంప్రదాయ వేషధారణలో ఆటలు ఆడుతూ ఆహ్వానించి, భోగ్ బండార్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎమ్మెల్సీ వాణీ దేవి, మాజీ ఎంపి సీతారామ్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, టి.ఆర్.ఎస్ నేతలు రూప్ సింగ్, రాంబాబు నాయక్, శ్రీరామ్ నాయక్, సుందర్ నాయక్, అనితా నాయక్, కరాటే రాజు, గోవింద్ నాయక్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్, ఇతర గిరిజన నేతలు, పూజారులు పాల్గొన్నారు.

అటు జనగామ జిల్లా దేవరుప్పులలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సేవలాల్ చిత్ర పటానికి పూమాలలు వేసి పుష్పాంజలి ఘటించిన మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, లంబాడా నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్