సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా రూపొందిన చిత్రం ‘శాకిని డాకిని‘. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది.
రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. ‘శాకిని డాకిని’ కొరియన్ ఫిల్మ్ రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్టు అద్భుతంగా మలిచాం. ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. యాక్షన్, కామెడీతో పాటు సమాజానికి మంచి సందేశం వుంటుంది. ఇద్దరు హీరోయిన్స్ వుండటం ఖచ్చితంగా కొత్తగా వుంది. మా పై నమ్మకంతో ఈ సినిమా చేసిన సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు. కదిలే కదిలే పాట ఈ సినిమా కథకి అద్దం పడుతుంది. ఈ పాట చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహిళలు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్లో సినిమా చూడాలి అన్నారు.
నివేదా థామస్ మాట్లాడుతూ.. ‘బ్రోచేవారెవరు’ సమయంలో సురేష్ బాబు గారు పరిచమయ్యారు. సినిమా గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ యూనిక్ సినిమాలకు పెట్టింది పేరు. ‘శాకిని డాకిని’ కథాచర్చల్లో పాల్గొన్నప్పుడే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. అలాగే థీమ్ సాంగ్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘శాకిని డాకిని’ కెమిస్ట్రీ ఈ థీమ్ సాంగ్ లో చూశారు. ఇందులో నేను రెజీనా చాలా డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాం. చిరాకుతో కూడిన ఫన్ రిలేషన్స్ అది. టీజర్, థీమ్ సాంగ్ లో మా కెమిస్ట్రీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో అది ఇంకా బావుంటుంది. సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ లో చూడాలి అని కోరారు.
సునీత తాటి మాట్లాడుతూ.. ఏ సినిమా అయినా చేయడానికి నాకు మూడు ముఖ్యమైన ఎలిమెంట్స్ అనిపిస్తాయి. కథ, కథానాయకులు, కథని ఎందుకు చేస్తున్నామనే స్ఫూర్తి. ‘శాకిని డాకిని’లో ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్ ని డీల్ చేస్తారనేది కథ. ఈ కథ మొదటి నుండి మాకు చాలా నచ్చింది. ఈ కథ విషయంలో మాకు చాలా నమ్మకం వుంది. ఒక ఆడ పిల్ల పుడితే ఆమె మొదటి పాత్ర కూతురు. అలాంటి ఒక కూతురిని దగ్గర పెట్టుకొని కొన్ని సినిమాలు చూడలేకపోతున్నాం. కానీ ఈ సినిమాలో అలాంటి కూతురు దగ్గర వున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. సురేష్ బాబు గారి సహకారంతో ఈ సినిమాని చేశాం. సినిమాలో నివేదా పంచ్ లు, రెజీనా కిక్కులు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. సినిమాని ఇంటర్ నేషనల్ స్థాయిలో ఎక్కడా రాజీపడకుండా తీశాం. రెజీనా, నివేదా చాలా హార్డ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 16న సినిమాని విడుదల చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు.
Also Read : రెజీనా, నివేదా థామస్ ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్