Saturday, January 18, 2025
Homeసినిమాఆరేళ్లపాటు అప్పులు తీర్చడమే సరిపోయింది: శర్వానంద్ 

ఆరేళ్లపాటు అప్పులు తీర్చడమే సరిపోయింది: శర్వానంద్ 

మొదటి నుంచి కూడా శర్వానంద్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. శర్వానంద్ నటన నీట్ గా ఉంటుంది  .. నిలకడగా ఉంటుంది. ఎక్కడా అతి చేస్తున్నట్టుగా అనిపించదు. అందువలన ఫ్యామిలీ ఆడియన్స్  ఆయనను ఎక్కువగా అభిమానిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్  నుంచి మంచి మార్కులు కొట్టేయడానికి హీరోలకు కొంత సమయం పడుతూ ఉంటుంది. కానీ శర్వానంద్ చాలా త్వరగానే ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతును కూడగట్టుకున్నాడు. అలాంటి శర్వానంద్ ను కొంతకాలంగా పరాజయాలు వెంటాడుతూ వస్తున్నాయి.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఒకే ఒక జీవితం‘ ముస్తాబవుతోంది. ఎమోషన్స్ ప్రధానంగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ ఇది. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటించగా, ముఖ్యమైన పాత్రలలో అమల అక్కినేని .. వెన్నెల కిశోర్ ..  ప్రియదర్శి కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వానంద్ మాట్లాడుతూ, గతంలో తాను చేసిన ‘కో అంటే కోటి’ సినిమాను గురించి ప్రస్తావించాడు.

‘కో అంటే కోటి’ సినిమాకి నేనే నిర్మాతగా ఉన్నాను. కథలో కొన్ని లోపాలు ఉన్న కారణంగా సినిమా పోయింది .. డబ్బులూ పోయాయి. దాంతో నా అనుకున్నవారు చాలామంది దూరమైపోయారు. డబ్బుకు అంత  ప్రాముఖ్యత ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. డబ్బు విషయంగా  వాళ్లంతా దూరం జరుగుతారని ఊహించలేదు. ఆ సినిమాపై చేసిన అప్పు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంతా క్లియర్ చేసేశాను. ఆరేళ్ల పాటు నేను ఒక్క షర్టు కూడా కొనుక్కోలేదు. అంత మొండిగా బ్రతికాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్‌ లాంచ్ చేసిన అనిరుధ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్