Thursday, November 21, 2024
HomeTrending Newsమల్లన్న,బీరప్ప స్వరూపమే కేసిఆర్

మల్లన్న,బీరప్ప స్వరూపమే కేసిఆర్

రాష్ట్రంలోని గొల్ల కురుమ లందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకె రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ప్రారంభించామని ,ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని 6 వేల కోట్లతో ప్రారంభించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో  18 సంవత్సరాలు దాటిన ప్రతి గొల్ల కురుమలకు గొర్రెల  యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో  6వేల కోట్ల 70 లక్షలతో మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, 80 లక్షలు గొర్రెల యూనిట్లను గొల్లకుర్మలకు పంపిణీ చేశామని మంత్రి తలసాని తెలిపారు. వాటి ద్వారా కోటి 30 లక్షల గొర్రె పిల్లలు ఉత్పత్తి అయ్యాయని అన్నారు. తద్వారా దేశం లోనే గొర్రెల సంపద ఎక్కువ గల నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం లో పంపిణీ చేసిన గొర్రెలు  అనారోగ్యంతో చనిపోతే  వారం రోజుల్లోగా ఇన్సూరెన్స్ ఇప్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గొల్ల కురుమలకు మల్లన్న బీరప్ప దేవుళ్ళ స్వరూపమే రాష్ట్ర ముఖ్యమంత్రి అని మంత్రి కొనియాడారు.

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గం లో 4 వేలకు పైగా లబ్ధిదారులకు గొర్ల యూనిట్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంక్షేమ రంగంలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. గొర్రెల యూనిట్ ధరను లక్షా 25 వేల నుండి లక్షా 75 వేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచారని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ,శాసనమండలి సభ్యులు ఎగ్గే మల్లేశం, వరంగల్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితరావు , జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పశుసంవర్ధక శాఖ ఎండి రామచందర్ ,అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు,. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్