Friday, September 27, 2024
HomeసినిమాKushi: వారిద్దరి కెమిస్ట్రీ 'ఖుషి' చేస్తుందన్న డైరెక్టర్

Kushi: వారిద్దరి కెమిస్ట్రీ ‘ఖుషి’ చేస్తుందన్న డైరెక్టర్

విజయ్ దేవరకొండ తాజాగా ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. సమంత  హీరోయిన్ గా నటిస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఖుషి.. అప్పట్లో ఓ సంచలనం. ఇప్పుడు అదే టైటిల్ తో విజయ్ సినిమా చేస్తుండడంతో అసలు కథ ఏంటనేది ఆసక్తిగా మారింది.

ఇటీవల సమంత అనారోగ్యం కారణంగా బ్రేక్ పడిన ఖుషి షూటింగ్ ఈ మధ్యే మళ్ళీ మొదలైంది. హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్, సమంత చాలా డిఫరెంట్ గా కనిపించారు. కాశ్మీర్‌, అలెప్పీ, హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివ నిర్వాణ ఈ సినిమాకు కొన్నికీలక విషయాలను తెలియచేశారు.

ఈ సినిమాలో విజయ్, సమంతల కెమిస్ట్రీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందని… కథలోని కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటాయని.. ఇదో లైట్‌హార్టెడ్ ఎంటర్టైనర్‌ అని అన్నారు. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ‘లైగర్’ తో మిస్ అయిన బ్లాక్ బస్టర్ ‘ఖుషి’తో సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్