Sunday, September 8, 2024
HomeTrending Newsఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో వాదనలు

ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో వాదనలు

మహారాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరుకుంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటాన్ని వ్యతిరేకిస్తూ ఏక నాథ్ షిండే వర్గం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉపసభాపతి నరహరి జిర్వాల్ పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణ, మహారాష్ట్రలో తమ కుటుంబాలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పటిషన్ లో కోరారు. ఈ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టులో హరీశ్ సాల్వే VS కపిల్ సిబల్ తపదనున్నారు. ఏక్‌నాథ్ షిండే శిబిరం తరఫున హరీశ్ సాల్వే , కపిల్ సిబల్ ఎంవీఏ ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ రోజు పిటిషన్ విచారణకు వస్తుండటంతో మహారాష్ట్రలో పోలీసు బందోబస్తు మరింత కట్టుదిట్టం చేశారు.

మరోవైపు ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. షిండేకు గతంలోనే సీఎం పదవి ఇస్తామన్నామని పేర్కొన్నారు. మే 30న షిండేకి సీఎం ఆఫర్ చేసినట్లు తెలిపారు. షిండేకి సీఎం పదవి ఇవ్వడానికి ఉద్ధవ్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ‘షిండేను మే30న ఆఫీస్ కు పలిపించారు.. మీకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే తీసుకోండని..అప్పుడే చెప్పారు.. నేను దిగిపోతా.. ఇవాళ్టి నుంచి మీరే ముఖ్యమంత్రి.. అని కూడా చెప్పారు.. అప్పుడేమో కాదు.. వద్దూ అంటూ నాటకాలు ఆడారు.. సమస్యలున్నాయంటూ ఏడ్చారు’.. అని ఆధిత్యఠాక్రే పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యఠాక్రే మండిపడ్డారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు సీఆర్పీఎఫ్‌ సెక్యూరిటీపై ఇవ్వడంపై విమర్శలు కురిపించారు. గౌహతి పారిపోయిన వారికి సెక్యూరిటీ ఇచ్చారంటూ ఫైరయ్యారు. ఆ సెక్యూరిటీని కశ్మీరీ పండిట్లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీ గుర్తు, పార్టీపై ప్రేమను రెబల్స్‌ కొల్లగొట్టలేరని ఆదిత్యఠాక్రే తేల్చి చెప్పారు. దమ్ముంటే రెబల్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. రెబల్స్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా శివ సైనికుల ధర్నాలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్