కరోనా నుంచి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటే.. ఓటీటీ వలన జనాలు థియేటర్లకు రావడం మానేయడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. సినిమా బాగోలేదు అనే టాక్ వస్తే చాలు స్టార్ హీరో సినిమా అయినా ఫస్ట్ డే మ్యాట్నీ నుంచే జనాలు రావడం లేదు. అందుచేత ఇండస్ట్రీలో సమస్యలను పరష్కరించుకున్నాకే షూటింగ్ లు చేయాలని.. ఆగష్టు 1 నుంచి షూటింగులు ఆపేయాలని యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ చిత్రాల షూటింగ్ లు ఆగిపోతున్నాయి.
ఓటీటీలకు భారీ చిత్రాలను 10వారాల తర్వాత ఇవ్వాలని.. చిన్న సినిమాలను 4 వారాల తర్వాత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే.. నిర్మాతలు అందరూ ఏకతాటిపై ఉన్నామని చెబుతున్నప్పటికీ.. వాళ్లల్లో వారికే ఐక్యత లేదనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. దీంతో నిర్మాతలు అందరూ ఒకసారి కూర్చొని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మరి.. ఈ షూటింగుల బంద్ అనేది ఎంత వరకు వెళుతుంది..? ఎన్ని రోజులు ఈ బంద్ జరుగుతుంది.. అనేది ఆసక్తిగా మారింది.