Sunday, January 19, 2025
HomeసినిమాSiddu Jonnalagadda - Chiranjeevi: చిరు, డీజే టిల్లు కలిసి సినిమా చేయనున్నారా.?

Siddu Jonnalagadda – Chiranjeevi: చిరు, డీజే టిల్లు కలిసి సినిమా చేయనున్నారా.?

చిరంజీవి రీ ఎంట్రీలో మరింత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాల తర్వాత దూకుడు పెంచారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి కథలు వింటున్నారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నా చెల్లెలు అనుబంధం నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

భోళా శంకర్ తర్వాత ఎవరితో మూవీ అనేది అనౌన్స్ చేయలేదు కానీ.. ఓ అరడజనుకు పైగా కథలు విన్నారు. అందులో ముందుగా కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. మరో విషయం ఏంటంటే.. ఈ కథలో కామెడీ చేసే ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రను డేజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డతో చేయించాలి అనుకుంటున్నారట. అగ్ర హీరోల్లో చిరు కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. అలాగే యంగ్ హీరోల్లో డీజే టిల్లు కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఇక వీరిద్దరూ కలిసి కామెడీ చేస్తే… వేరే లెవల్ లో ఉంటుంది.

ఇటీవల చిరును కలిసి కళ్యాణ్ కృష్ణ కథ చెప్పినప్పుడు ఆ పాత్రకు సిద్ధు జొన్నలగడ్డ అయితే బాగుంటుందని ఆయనే సూచించారట. సిద్ధును కాంటాక్ట్ చేస్తే వెంటనే ఒప్పుకున్నాడట. ఈ చిత్రానికి ర‌చ‌యిత ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ అందిస్తున్నాడు. త‌న‌వ‌న్నీ ఫ‌క్తు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలే. అలాంటి క‌థ‌ల‌కు చిరు కేరాఫ్‌ అడ్రస్ అని చెప్పచ్చు. మ‌రి.. ఈ కాంబో మూవీ ఏ రేంజ్‌లో వినోదం అందిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. భోళా శంక‌ర్ త‌ర్వాత చిరు ఈ సినిమానే సెట్స్‌పైకి తీసుకెళ్లే అవ‌కాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్