Sunday, January 19, 2025
HomeసినిమాSimhadri Re-release: పోకిరి, జల్సా రికార్డులు క్రాస్ చేస్తాడా?

Simhadri Re-release: పోకిరి, జల్సా రికార్డులు క్రాస్ చేస్తాడా?

ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్లో రూపొందిన ‘సింహాద్రి’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ఇప్పుడు 1000 స్క్రీన్స్ లో రీ-రిలీజ్ చేస్తుండడం విశేషం అయితే..దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం మరో విశేషం. యంగ్ హీరో విశ్వక్ సేన్ గెస్ట్ గా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ సింహాద్రి చిత్రం రీ రిలీజ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

2003లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ ని అప్పట్లో థియేటర్ అనుభూతి చెందని ఫ్యాన్స్ అందరూ మే 20 కోసం ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో ఉదయం షోలు దాదాపుగా ఫుల్ అయ్యాయి. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ మాస్ కంటెంట్ మూవీ లేదు కాబట్టి కొత్త జనరేషన్ ప్రేక్షకులు కూడా సింహాద్రి చిత్రాన్ని థియేటర్లో ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

పోకిరి రీ రిలీజ్ లో 1.7 కోట్లు వసూలు చేసింది. జల్సా దాదాపు 3 కోట్లు కలెక్ట్ చేసింది. సింహాద్రి ఆ రికార్డులను క్రాస్ చేసి కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇంతకు ముందు రీ రిలీజ్ కు నోచుకున్న బాద్షా, ఆంధ్రావాలా చిత్రాలు ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోలేదు. ఇప్పుడు అసలైన మాస్ బొమ్మ సింహాద్రి వస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. యంగ్ టైగర్ రీ రిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్