Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ధనుష్‌, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సార్‘. ఈ చిత్రాన్ని తమిళ్ లో వాతి అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన తొలి గీతం విడుదల చేశారు.

‘ మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు‘… అంటూ సాగే ఈ గీతానికి తమిళంలో ‘ధనుష్‘, తెలుగులో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించటం విశేషం. జి వి ప్రకాష్ స్వరాలు, శ్వేతామోహన్ స్వరం పోటీ పడ్డాయనిపిస్తింది. పాట చిత్రీకరణ కూడా అంతే. నాయిక, నాయికల భావోద్వేగాలు ,కనిపించే దృశ్యాలు, వారి అభినయం వీక్షకుల మనసును హత్తుకుంటాయి. కళాశాల నేపధ్యంలో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించుకున్న ఈ గీతం చిత్ర కథానుసారం కథానాయకుడు ధనుష్ ప్రవర్తన, అతని మంచి మనస్తత్వం, గొప్పతనం గుర్తెరిగిన నాయిక సంయుక్త మీనన్ మనసు ప్రేమైక భావనకు గురైన సందర్భం. ఆ ఊహల్లో, అలాంటి నేపధ్యంలో వచ్చే గీతం ఇది.

పాటానుసారం ధనుష్, సంయుక్త మీనన్, విద్యార్థులు కనిపిస్తారు. సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వర పరిచిన బాణీలు సంగీత ప్రియుల్ని మధురమైన భావనకు గురిచేస్తాయి అంటున్నారు ఈ పాట రచయిత రామజోగయ్య శాస్త్రి. ఆయన మాటల్లోనే ఇంకా చెప్పాలంటే.. ఇది అచ్ఛ తెలుగు పాట, ఓ అందమైన పాట, మంచి పాట, ప్రయోజనం ఉన్న పాట, ఉపయోగం ఉన్న పాట, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన పాట ఇది. పాట రాయటానికి కొంత కష్ట పడినప్పటికీ, దర్శకుడు వెంకీ గారు చెప్పిన పాట సందర్భం, ఆయన ఆలోచనలు అన్నీ చక్కని సాహిత్యం సమకూర్చటానికి నన్ను ముందుకు నడిపాయి. ఈ పాట కు ఇటు నేను, అటు తమిళంలో ధనుష్ సాహిత్యం అందించటం కొత్త అనుభూతి. భావం ఒక్కటే అయినా శైలి భిన్నంగా ఉంటుంది. జి వి ప్రకాష్ బాణీ ల్లో మరింతగా ఒదిగిన సాహిత్యం ఉన్న పాట ఇది. గాయని శ్వేతా మోహన్ గాత్రం పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది. చాట్ బస్టర్స్ లో నిలిచే పాట ఇది. అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య గార్లకు కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం పరిచారు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com