Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్-త్రివిక్రమ్ మూవీలో సితార... నిజ‌మేనా?

మ‌హేష్-త్రివిక్రమ్ మూవీలో సితార… నిజ‌మేనా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా క‌థ ఏంటి..?  అని తెలుసుకునేందుకు అభిమానులు, సినీ జ‌నాలు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. త్రివిక్ర‌మ్ మార్క్ అయిన ఫ్యామిలీ స్టోరీ అని ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ఇది పొలిటిక‌ల్ మూవీని టాక్ వినిపించింది.

అయితే… ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రాని స‌రికొత్త యాక్ష‌న్ మూవీగా ఉంటుంద‌ని తెలిసింది. మ‌హేష్‌ ని మాస్ క్యారెక్ట‌ర్ లో కొత్త‌గా చూపించేలా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేశార‌ట త్రివిక్ర‌మ్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మ‌హేష్ ముద్దుల కూతురు సితార న‌టించనుంద‌ని తెలిసింది. ఈ సినిమా కథ మొత్తం  పాప చుట్టూ సాగుతుందట. ఆ పాప పాత్రలోనే సితార కనిపించబోతుందని తెలుస్తోంది. అయితే… ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

సితార న‌టించ‌డం క‌నక నిజ‌మైతే.. ఈ సినిమాకి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టిస్తుంది. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఆ అంచ‌నాల‌కు మించి ఈ సినిమా ఉంటంద‌ని.. ఖ‌చ్చితంగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయమ‌ని టీమ్ మెంబ‌ర్స్ చాలా న‌మ్మ‌కంగా చెబుతున్నారు. మ‌రి.. మ‌హేష్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్