Saturday, January 18, 2025
Homeసినిమాసూర్య ప్లేస్ లో శివకార్తికేయన్!

సూర్య ప్లేస్ లో శివకార్తికేయన్!

ఏ మాత్రం గ్యాప్ రాకుండా వరుస సినిమాలు చేసే కోలీవుడ్ హీరోల జాబితాలో సూర్య ముందువరుసలో కనిపిస్తాడు. కథలో కొత్తదనం .. తన పాత్రలో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. తనకి బాగా నచ్చిన కథకి నిర్మాత దొరక్కపోతే, తన సొంత బ్యానర్లో నిర్మించడానికి ఆయన ఎంత మాత్రం వెనుకడుగు వేయడు. అలాంటి సూర్య నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు కూడా. ఈ సినిమాకి ‘పురాణనూరు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో సుధా కొంగర – సూర్య కాంబినేషన్లో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ ఘన విజయాన్ని అందుకుంది. ఇతర భాషల్లోను ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఈ ప్రాజెక్టు నుంచి సూర్య తప్పుకున్నాడని అంటున్నారు. అందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా ఆయన ఈ సినిమా అయితే చేయడం లేదనేది వాటి సారాంశం. అందువలన ఇదే కథను శివకార్తికేయన్ కి సుధా కొంగర విలిపించిందట. అతనికి కథ నచ్చడం .. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఆకాశ్ కృష్ణన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘అమరన్’ చేస్తున్న శివకార్తికేయన్, ఆ తరువాత ఈప్రాజెక్టుపైకి రానున్నాడని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్