Sunday, January 19, 2025
Homeసినిమా'ఘోస్ట్' టీజర్ కు ముహూర్తం ఫిక్స్

‘ఘోస్ట్’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్

డా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని చిత్రానికి దర్శకుడు.సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్ ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్మెంట్ ను స్ట్రైకింగ్ పోస్టర్ తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్