Sunday, January 19, 2025
HomeసినిమాSkanda, Chandramukhi: ఈ మూడు సీక్వెల్స్ నిజంగా వస్తాయా..?

Skanda, Chandramukhi: ఈ మూడు సీక్వెల్స్ నిజంగా వస్తాయా..?

గత వారం మూడు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ‘స్కంద’, ‘చంద్రముఖి 2’, ‘పెదకాపు 1’.. ఈ మూడు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి కానీ.. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. స్కంద సినిమా గురించి చెప్పాలంటే.. లాజిక్కులు లేకుండా బోయపాటి ఎప్పటిలానే తనదైన స్టైల్ లో సినిమా తీసారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి ఓపెనింగ్ బాగానే వచ్చింది. రామ్ కెరీర్ లనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పచ్చు. ఇప్పుడున్న సినిమాల్లో ఈ సినిమానే కాస్త బెటర్ అనే టాక్ వుంది.

ఇక చంద్రముఖి సీక్వెల్ అంటూ చంద్రముఖి 2 వచ్చింది. లారెన్స్, కంగనా కాంబోలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మామూలుగా ఉండదు.. అదిరిపోతుంది అంటూ చాలా చెప్పారు. సినిమా చూస్తే.. చంద్రముఖి సినిమాను రీమేక్ చేశారనే టాక్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. చంద్రముఖి పరువు తీసారు అంటున్నారు సినీ జనాలు. లారెన్స్ కెరీర్ లో డిజాస్టర్ అని చెప్పచ్చు. పెదకాపు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పచ్చు. కొత్త హీరో పై 45 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఈ మూవీకి టైటిలే మైనస్ అని టాక్ వినిపిస్తుంది.

ఈ మూడు సినిమాలకు ఉన్న పోలిక ఏంటంటే.. స్కంద క్లైమాక్స్ లో స్కంద 2 అని ప్రకటించారు. పెదకాపు రిలీజ్ ముందు నుంచి పెదకాపు పార్ట్ 2 ఉందని అనౌన్స్ చేశారు. ఇక చంద్రముఖి 2 క్లైమాక్స్ లో చంద్రముఖి 3 ఉందని హింట్ ఇచ్చారు. ఇలా ఈ మూడు సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. ఈ సినిమాల రిజెల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక సీక్వెల్స్ తీయాలనే ఆలోచనను విరమించుకుంటారని.. ఇక ఈ చిత్రాలకు సీక్వెల్స్ లేనట్టే అని టాక్ వినిపిస్తుంది..

RELATED ARTICLES

Most Popular

న్యూస్