Saturday, January 18, 2025
HomeసినిమాSkanda Vs Chandramukhi 2: 'స్కంద'తో పోటీకి సై అంటున్న'చంద్రముఖి 2'

Skanda Vs Chandramukhi 2: ‘స్కంద’తో పోటీకి సై అంటున్న’చంద్రముఖి 2’

రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘స్కంద’. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. అయితే.. ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు. లారెన్స్, కంగనా కాంబినేషన్లో పి.వాసు రూపొందించిన చిత్రం ‘చంద్రముఖి 2’. ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో సెప్టెంబర్ 15న బాక్సాఫీస్ దగ్గర రామ్ స్కంద, లారెన్స్ చంద్రముఖి 2 సినిమాలు పోటీపడనున్నాయి. ఈ రెండింటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో అనేది ఆసక్తిగా మారింది.

అయితే.. ప్రభాస్ సలార్ చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదాపడింది. ఎప్పుడైతే.. సలార్ వాయిదా పడిందని తెలిసిందో అప్పటి నుంచి స్కంద ప్లాన్ మారింది. సెప్టెంబర్ 15 కంటే సెప్టెంబర్ 28 మంచి డేట్ అని ఆ డేట్ కి షిప్ట్ అయ్యింది. చంద్రముఖి 2 కు కాస్త పోటీ తగ్గింది అనుకున్నారు. అయితే.. ఇప్పుడు చంద్రముఖి 2 కూడా పోస్ట్ పోన్ అయ్యింది. సెప్టెంబర్ 15 నుంచి 28కి వాయిదా పడింది. దీంతో స్కంద, చంద్రముఖి 2 మధ్య పోటీ తప్పింది అనుకుంటే.. మళ్లీ పోటీ ఏర్పడింది. మరి.. స్కంద, చంద్రముఖి 2 ఈ రెండింటిలో ఏ సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్