Sunday, January 19, 2025
Homeసినిమా"స్లమ్ డాగ్ హజ్బెండ్" ఫ్రస్టేషన్ సాంగ్ రిలీజ్

“స్లమ్ డాగ్ హజ్బెండ్” ఫ్రస్టేషన్ సాంగ్ రిలీజ్

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా “స్లమ్ డాగ్ హజ్బెండ్“. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. “స్లమ్ డాగ్ హజ్బెండ్” సినిమా నుంచి ‘ఫ్రస్టేషన్ సాంగ్’ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. పాట కాన్సెప్ట్ బాగుందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే… ఇట్స్ ఏ మెడిటేషన్ సాంగ్ నహీ, ఇరిటేషన్ సాంగ్ నహీ, డిప్రెషన్ సాంగ్ నహీ, ఇట్ ఈజ్ ఫ్రస్టేషన్ సాంగ్ .. అంటూ సాగుతుందీ పాట. ఈ పాటకు పూర్ణా చారి సాహిత్యాన్ని అందించగా..భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి పాడారు. పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ ను చెబుతూ ఈ పాట డిజైన్ చేశారు. ఈ పాటలో సునీల్ స్పెషల్ అప్పీయరెన్స్ చేయడం విశేషం.

Also Read : రవితేజ చేతుల మీదుగా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్