Sunday, January 19, 2025
Homeసినిమా'లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది - హీరో సోహైల్

‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది – హీరో సోహైల్

స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా శ‌నివారం చిత్ర యూనిట్ టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సోహైల్‌, నిర్మాత హ‌రిత గోగినేని, ద‌ర్శ‌క‌డు అభి, బిగ్ బాస్ ఫేమ్స్‌.. మెహ‌బూబ్‌, అఖిల్ సార్థ‌క్‌, స‌న్నీ త‌దిత‌రులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా హీరో సోహైల్ మాట్లాడుతూ…ఈరోజు నేను హీరోగా చేసిన ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మాట‌లు రావ‌టం లేదు. అభిమానులే నాకు ధైర్యం. ఇండ‌స్ట్రీలో మ‌నం పిలిస్తే వ‌స్తారు.. రారు.. వ‌చ్చినా మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడ‌రు. కానీ మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డే ఫ్యాన్స్‌ మ‌నల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఎక్క‌డెక్క‌డి నుంచో ఫ్యాన్స్ వ‌చ్చారు. ఆ విష‌యం తెలిసి ఆశ్చ‌ర్య‌పోయాను. స‌క్సెస్ ఉన్నా, లేక‌పోయినా మ‌నల్ని ఆద‌రించేది మ‌నం ఇష్ట‌ప‌డేవాళ్లు, ఫ్యాన్స్‌, ఫ్రెండ్స్‌. అలాంటి వాళ్లు నాకు అండ‌గా ఉన్నారు.

సినిమాకు మా వ‌ల్ల ఎంత వీల‌వుతుందో దాన్ని చేశాం. బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత తొలి సినిమాగా ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ రిలీజ్ వ‌స్తుంది. లైఫ్‌లో 12-13 ఏళ్లు చాలా క‌ష్ట‌ప‌డ్డాను. బెక్కం వేణుగోపాల్‌గారు నాకు స‌పోర్ట్ చేసి అవ‌కాశం ఇచ్చారు. మా నిర్మాత హ‌రిత గోగినేని గ‌ట్స్ ఉన్న ప్రొడ్యూస‌ర్‌. అభి గారు అన్నీ ఎలిమెంట్స్‌ను చ‌క్క‌గా మిక్స్ చేసి ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమాని తెరకెక్కించారు. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌ గారికి థాంక్స్‌. చాలా చిన్న స్టేజ్ నుంచి ఈ స్థాయికి వ‌చ్చాం. మాకు తెలిసింది న‌ట‌న మాత్ర‌మే. డిసెంబ‌ర్ 30న సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఇంకా క‌ష్ట‌ప‌డ‌తాను’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్