Saturday, January 18, 2025
Homeసినిమానాగ్ తో రొమాన్స్ కి సోనాక్షి రెడీ?

నాగ్ తో రొమాన్స్ కి సోనాక్షి రెడీ?

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించనున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ గా రానున్న ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు గత కొంత కాలంగా వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. తాజా సమాచారం ప్రకారం.. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నటింనుందని టాక్ వినిపిస్తోంది. ఎవరా బాలీవుడ్ బ్యూటీ అంటు.. సోనాక్షి సిన్హా. మన సీనియర్ హీరోల సినిమాల్లో నటించేందుకు హీరోయిన్స్ దొరకడం లేదు.

బంగార్రాజులో నటించేందుకు కొంత మంది తార పేర్లు అనుకున్నప్పటికీ.. ఎవరు సెట్ కావడం లేదు. ట్రెడిషనల్‌గా కనిపించే సోనాక్షిని బంగార్రాజులో నటింపజేస్తే బాగుంటుంది అనేది నాగార్జున అనుకున్నారట. ఇదే విషయం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు చెబితే.. ఆయన కూడా బాగుంటుంది అనడంతో ఆమెనే ఫిక్స్ చేయనున్నారని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే.. నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అందుచేత ఇప్పట్లో నాగచైతన్య డేట్స్ ఖాళీ లేవు. అందుచేత మరో యంగ్ హీరో కోసం చూస్తున్నారని టాక్. మరి.. నాగచైతన్య డేట్స్ అడ్జెస్ట్ చేసి ఈ మూవీలో నటిస్తాడా..? లేక వేరే యంగ్ హీరో నటిస్తాడా.? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్