Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్మూడో టెస్ట్: సౌతాఫ్రికా 210 ఆలౌట్

మూడో టెస్ట్: సౌతాఫ్రికా 210 ఆలౌట్

SA 201 All-out: మూడో టెస్టులో సౌతాఫ్రికా 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బుమ్రా ఐదు వికెట్లతో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. కేప్ టౌన్ లోని న్యూల్యాండ్స్ స్టేడియం వేదికగా జరుగుతోన్నఈ మ్యాచ్ లో నిన్న మొదటిరోజు ఇండియా 223 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఒక వికెట్ కోల్పోయి 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి ఆటను సౌతాఫ్రికా మొదలుపెట్టింది.

కీగాన్ పీటర్సన్ ఒక్కడే ­71 పరుగులతో రాణించాడు. బావుమా-28; మహారాజ్-25; వాన్ డేర్ డస్సేన్-21 పరుగులు చేశారు.  జస్ ప్రీత్ బుమ్రా మరోసారి తన మాయాజాలం ప్రదర్శించి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఉమేష్, షమీ చెరో రెండు; శార్దూల్ ఒక వికెట్ తీసుకున్నారు.  తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 13 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది.

రెండోరోజే ఇండియా తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(10); మయాంక్ అగర్వాల్ (7)మరోసారి విఫలమయ్యారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 2 వికెట్లకు 52  పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా-9; కెప్టెన్ కోహ్లీ-14 పరుగులతో క్రీజులో ఉన్నారు. మార్కో జేన్సన్, రబడ చెరో వికెట్ తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్