Sunday, May 19, 2024
HomeTrending Newsఎమ్మెల్సే కవితకు న్యాయస్థానం వార్నింగ్

ఎమ్మెల్సే కవితకు న్యాయస్థానం వార్నింగ్

ఎమ్మెల్సీ కవిత కంట్రోల్ లో ఉండాలని… న్య్యాయస్థానం ప్రాంగణంలో మీడియాతో మాట్లాదటంపై కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ప్రాంగణంలో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ… విచారణ సంస్థలపై ఆరోపణలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ సమయంలో బహిరంగ వ్యాఖ్యలు చేయటం న్యాయ విరుద్దమనే విషయం తెలియదా అని ప్రత్యేక కోర్టు జడ్జి ప్రశ్నించారు.

సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సోమవారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ బిజెపిపై ఆరోపణలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని ఆరోపించారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు. వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏం లేదని తెలిపారు.

ఈ నెల 23 వరకు న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆమెను అధికారులు తీహార్‌ జైలుకు తరలించనున్నారు. అయితే 14 రోజులపాటు కస్టడీ విధించాలని సీబీఐ కోరగా, 9 రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్