Sunday, February 23, 2025
Homeసినిమా'భీమ్లా నాయక్' నుంచి డేనియల్ శేఖర్ టీజ‌ర్

‘భీమ్లా నాయక్’ నుంచి డేనియల్ శేఖర్ టీజ‌ర్

Rana Poster released:
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే – సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి ఆయన పోషిస్తున్న డేనియల్ శేఖర్ పాత్ర కు సంబంధించి ప్రత్యేక ప్రచార చిత్రం విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని ప‌రిశీలిస్తే..

“వాడు అరిస్తే భయపడతావా
ఆడికన్నా గట్టిగా అరవగలను
ఎవడాడు….
దీనమ్మ దిగొచ్చాడా…
ఆఫ్ట్రాల్ ఎస్ ఐ
సస్పెండెడ్….”

అంటూ డేనియల్ శేఖర్ పాత్రధారి రానా ఆవేశంగా ఎవరితోనో చిత్ర కథానుసారం సంభాషించటాన్ని ఇందులో చూడవచ్చు. ఈ సన్నివేశం ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్