Wednesday, March 26, 2025
Homeసినిమానవమన్మధుడిగా ఆ ‘బంగార్రాజు’

నవమన్మధుడిగా ఆ ‘బంగార్రాజు’

Special Poster Released From Bangarraju On Naga Chaitanya Birthday  :

టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ చిత్రానికి ప్రీక్వెల్ గా ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ లో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంటే.. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న‌ ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి న‌టిస్తుంది. ఈ రోజు నాగ‌చైత‌న్య పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘బంగార్రాజు’ టీజ‌ర్ రిలీజ్ చేశారు.

ఈ టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. బంగార్రాజు క‌ర్ర‌, వాచి, పులిగోరు.. ధ‌రించి బంగార్రాజులా కర్ర పట్టుకుని బుల్లెట్ పై నాగ చైతన్య కనిపించాడు. దీనిని బ‌ట్టి ‘బంగార్రాజు’ మ‌న‌వ‌డుగా చైత‌న్య న‌టిస్తున్నాడ‌నిపిస్తుంది. ఈ పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ల‌వ్, రొమాన్స్, ఎమోషన్స్, యాక్ష‌న్.. ఇలా అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయి. టీజ‌ర్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే.. అదిరింది అనేలా ఉంది.

సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా చిత్రాన్ని శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు. మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే.. బంగార్రాజు సంక్రాంతికి వ‌స్తుందా..?  వాయిదా ప‌డుతుందా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : బంగార్రాజు ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ కి ముహుర్తం ఫిక్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్